దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

అలంపూర్‌: జోగుళాంబదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్‌ క్షేత్రంలో ఈఓ దీప్తిరెడ్డితో కలిసి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోగుళాంబ క్షేత్రంలో అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాలపై విస్తృతంగా ప్రచారం చే యాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. మహిళా భక్తులకు రక్షణగా మహిళా పోలీసులు ఉండే విధంగా చూసుకోవాలన్నా రు. అంతకుముందు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో ము న్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు

గద్వాల క్రైం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ ఇన్‌చార్జి అధికారి సంధ్యాకిరణ్మయి బుధవారం ఒక ప్రటనలో తెలిపారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 43,419 విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు విద్యార్థుల ఎత్తు, బరువు, రక్తపోటు, చెవి, ముక్కు, గొంతు, గుండె, చర్మవ్యాధులు, కంటి తదితర అంశాలను పరీక్షించనున్నట్లు తెలిపారు.

నేడు కలెక్టరేట్‌ ముట్టడి

కేటీదొడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్శింహ తెలిపారు. బుధవారం కేటీదొడ్డి మండలం నందిన్నెలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతూ.. విద్యార్థులకు అండగా ఉంటున్న స్వీపర్ల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వారికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న కలెక్టరేట్‌ ముట్టడిలో స్వీపర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కుంటమ్మ, తాయమ్మ, శివప్ప, నర్సింహులు, నాగేశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement