రైతులకు ఇబ్బంది కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పనుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మల్లమ్మకుంట భూ పరిహారం విషయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ రైతులతో సమావేశమైన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే హైదరాబాద్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ ఆవశ్యకత, పనులు జరుగుతున్న తీరును ఆయన మంత్రికి వివరించారు. మల్లమ్మకుంట భూసేకరణపై కలెక్టర్‌తో మాట్లాడి.. అక్కడికక్కడే రైతుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని, భూముల ధరలో పునరాలోచించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ల్యాండ్‌ ఆక్వజేషన్‌ కమిషనర్‌ శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి మల్లమ్మకుంటపై తగిన ఆదేశాలను మంత్రి జారీ చేసినట్లు సంపత్‌కుమార్‌ స్థానిక విలేకరులకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement