మానవపాడు: మండలంలోని చెన్నిపాడులో ఉన్న పురాతన గ్రంథాలయం, పలు ఆలయాలను బుధవారం జెడ్పీ సీఈఓ నర్సింగ్‌రావు పరిశీలించారు. ఇలాంటి గ్రంథాలయాన్ని యు వకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేయాలని, చెన్నకేశవస్వామి, సత్యనారాయణ స్వామి ఆలయాలను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు సీఈఓను కోరారు. కార్యక్రమంలో సీతారామిరెడ్డి, తిరుమల్‌ర్డెడి, పుల్లారెడ్డి, సర్పంచ్ రత్నకుమార్ పాల్గొన్నారు.
మహాధర్నా వాయిదా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన మహాధర్నాను వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈనెల 18న సీఎం రేవంత్‌రెడ్డితో నాయకులు భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.


