కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం

Sep 10 2026 12:57 AM | Updated on Sep 10 2026 12:57 AM

గద్వాల క్రైం: తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ భాషా సంస్కృతులు, ప్రజా చైతన్యానికి కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్‌ పాల్గొన్నారు.

ఆయన ఆశయాలు కొనసాగిద్దాం

ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన కవితలతో నిరంతరం శ్రమించిన కాళోజీ నారాయణరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పదవ పటాలం ఇన్‌చార్జి కమాండెంట్‌ ఆదినారాయణ అన్నారు. బీచుపల్లి పదవ పటాలంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కవితలతో ప్రజల్లో ఉద్యమ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడు కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, వెంకటరమణ, ఆర్‌ఐలు నిరంజన్‌రెడ్డి, భార్గవరెడ్డి, ప్రసన్న, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement