గద్వాల న్యూటౌన్: స్వయం సహాయక సంఘాల నిర్వహణలో పారదర్శకత.. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం.. జవాబుదారీతనం, నిధుల సద్వినియోగం కోసం సామాజిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. వీబీ–జీ రామ్‌జీ సామాజిక తనిఖీ బృందాలకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 10 నుంచి 15 మంది మహిళలతో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇలా ఉన్న 20 నుంచి 25 గ్రూపులు గ్రామైక్య సంఘాలుగా ఏర్పడగా.. సహకార చట్టం ప్రకారం వీటికి కార్యవర్గాలు, మండల, జిల్లా మహిళా సమాఖ్యలు ఉన్నాయి.
రూ.కోట్ల్లలో ఆర్థిక లావాదేవీలు..
బ్యాంకు లింకేజీ కింద ఎస్‌హెచ్‌జీలకు సీనియార్టీ ప్రాతిపదికన రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. వీటితో పాటు సభ్యులు ప్రతినెలా రూ. 200 నుంచి రూ.500 పొదుపు చేసుకుంటూ అంతర్గతంగా అప్పులు ఇస్తున్నారు. జిల్లాకు సంబంధించి ప్రతి ఆర్థిక సంవత్సంలో రూ.230 కోట్ల వరకు బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తున్నారు. వీటితో పాటు సభ్యురాలికి వ్యక్తిగతంగా సీ్త్రనిధి నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఏటా రూ.30 కోట్ల వరకు రుణాలు అందుతున్నాయి. వరిధాన్యం కొనుగోళ్లు, ఎస్‌హెచ్‌జీల పొదుపులు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, కొన్ని రకాల వ్యాపారాలు, స్కూల్ యూనిఫారాల కుట్టుపని తదితర ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ గ్రామైక్య సంఘాలకు ఉంటుంది. ఇక మండల, జిల్లా మహిళా సమాఖ్యలు గ్రామైక్య సంఘాల పొదుపులు, అద్దె బస్సులు, పెట్రోల్ బంక్‌లు, క్యాంటీన్లు, కొన్ని రకాల వ్యాపారాల నిర్వహణ చూస్తున్నాయి. ఇలా ఎస్‌హెచ్‌జీ మొదలుకొని జెడ్‌ఎంఎస్ వరకు పలు ఆర్థిక కార్యక లాపాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి.
జవాబుదారీతనం కోసం..
ఎస్‌హెచ్‌జీల్లో అంతర్గత జమ, ఖర్చులు మినహా ఆడిటింగ్ లేదు. దీన్ని సాకుగా తీసుకొని కొన్నిచోట్ల నగదు దుర్వినియోగం, సొంతానికి నిధులు వాడుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక గ్రామైక్య సంఘాలు, మండల, జిల్లా మహిళా సమాఖ్యలకు సంబంధించి ఎంపిక చేసిన ఆడిటర్లు ఆడిటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు సభ్యులందరికీ తెలియడం లేదు. కొన్ని విషయాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించినా.. రికవరీ కావడం లేదు. నిధులు పక్కదారి పట్టినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించాలనే ఉద్దేశంతోనే వీబీ–జీ రామ్‌జీ బృందాలతో సామాజిక తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పలు జిల్లాల్లోని కొన్ని సంఘాలను పైలెట్ ప్రాజెక్ట్‌లుగా ఎంపిక చేశారు. కొన్ని నెలల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
చిరుతల అలజడి
గండేడ్ మండలంలో చిరుతల సంచారం అధికమైంది. ఆగస్టులోనే ఐదు పశువులను పొట్టన పెట్టుకున్నాయి.
–8లో u
స్వయం సహాయక సంఘాలపై సామాజిక తనిఖీ
వీబీ–జీ రామ్‌జీ బృందాలకు బాధ్యతలు
నిధుల వినియోగంలో
అవకతవకలు జరగకుండా చర్యలు
సంఘాల నిర్వహణలో
పెరగనున్న పారదర్శకత


