–8లో u
గద్వాల క్రైం: సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు జిల్లాలోని కొందరు రైస్ మిల్లు నిర్వాహకులు కష్ట పడ్డాకుండా సొమ్ము రాబట్టాలి (సీఎమ్మార్) అనే కొత్త నిర్వచనం చెప్తున్నారు. జిల్లాలోని మిల్లు యాజమానులు చేస్తున్న ధన.. ధాన్యం దందాలపై ఇటీవల పోలీసుశాఖ పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చే సింది. వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం నుంచి రైస్‌మిల్లుల యజమానులు సేకరించి గడువులోగా ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ లో విక్రయించి భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో 63కు పైగా రైస్ మిల్లులో ఇదే తరహా దందా కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు నమోదైన కేసులు
● కేటీదొడ్డి మండలానికి చెందిన కమ్మిడిస్వామి రైస్ మిల్లు నిర్వాహకుడు 12,643 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4.70 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి రాగా నిర్వాహకుడు కుర్వ వీరన్నను ఆగస్టు 27న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
● సూర్య ట్రేడర్స్‌లో 11,580 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేశారు. విలువ రూ.3.50 కోట్లు కాగా శాంతినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
● అన్నపూర్ణ రైస్ మిల్లులో 24,369 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం కాగా వీటి విలువ రూ.8.21 కో ట్లు.దీనిపై అయిజ పోలీసులు కేసు నమోదు చేశారు.
● శ్రీకృష్ణ రైస్ మిల్లులో 10.132 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేయగా.. విలువ రూ.3.76 కోట్లు. గద్వాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
● శ్రీరామ రైస్ మిల్లులో 10,496 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేయగా.. విలువ రూ. 2.88 కోట్లు. గద్వాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారులపై విచారణ..
అక్రమార్కులకు సహకరించిన అధికారులపై విచా రణ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి పోలీసుశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి కే జిల్లా సివిల్ సప్‌లై శాఖలోని ముగ్గురు అధికారులను విచారించారు. త్వరలో మరి కొంతమందిని విచారించే అవకాశం ఉంది.
రైస్ మిల్లర్ల అక్రమ వ్యాపారాలపై నిఘా కరువు
మామూళ్ల మత్తులో కేటాయింపులు!
అధికారుల పాత్రపై విచారణ
తప్పించుకునేందుకు వ్యూహం
తాజాగా 12,643
మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా


