మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 24న తెలంగాణ ఉ ద్యమకారుల సమ్మేళనం ఉంటుందని పీయూ ఉద్యమకారుల కమిటీ సభ్యులు అన్వర్, రా ము తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీయూ ఆవరణలో సమ్మేళనం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కళాశాలల ఉద్యమకారులు ఆ రోజు జరిగే సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పలువురు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బ్రహ్మం, శివ, కొండా గణేష్, చంద్రకాంత్‌గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, గోపాల్, సుగుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండు యూనిట్లలో
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ఆదివారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 102.058 మి.యూ., దిగువన ఒక యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 88.010 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 190.068 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.
కేఎస్పీలో 20.6
అడుగులకు నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు(కేఎస్పీ)లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి 20.6 అడుగులకు చేరింది. గత నెల 19న కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రెండు వారాల పాటు కొన సాగించారు. ఐదు రోజుల క్రితం విడుదల నిలిపివేసి ప్రాజెక్టును నింపేందుకు జూరాల వద్ద రెండు పంపులను నడుపుతూ ఎత్తిపోతల ద్వా రా నీటిని తరలిస్తున్నారు. నీటి విడుదలకు ముందు 18 అడుగులుగా ఉన్న మట్టం ప్రసు ్తతం 20.6 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో 12 అడుగుల నీరు చేరాల్సి ఉంది.


