గద్వాల న్యూటౌన్: భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ప్రముఖ జములమ్మ, పరశురామ స్వామివారి సన్నిధిలో శ్రీజమదగ్ని, శ్రీజములమ్మ అమ్మవారి 6వ వార్షిక కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 5గంటలకు ఎదుర్కోళ్లు, మంగళవారం మధ్యాహ్నం 12:15 గంటలకు అభిజిత్ లగ్నంనందు శ్రీజమదగ్ని, శ్రీజములమ్మ అమ్మవారి కల్యాణమహోత్సవం, అనంతరం పల్లకీసేవ నిర్వహించనున్నారు. 9వ తేదీ బుధవారం ఉదయం 8గంటలకు ధ్వజావరోహణం ఉంటుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ముఖద్వారం నుంచి ఆలయం వరకు రంగురంగుల విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించారు. సుమారు 10వేల మంది భక్తులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉండడంతో వారి సౌకర్యార్థం టెంట్లు, కుర్చీలు, తాగునీటి, భోజన వసతి కల్పించినట్లు ఈఓ పురందర్‌కుమార్ తెలిపారు.


