ఓటు హక్కు కాపాడే బాధ్యత పార్టీ శ్రేణులదే.. | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు కాపాడే బాధ్యత పార్టీ శ్రేణులదే..

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

మక్తల్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని.. అర్హుల ఓటు హక్కును కాపాడే బాధ్యత కార్యకర్తలదేనని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ పరిధిలోని బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో సుమారు 36 వేల ఓట్లు తొలగించబడ్డాయని.. తాజాగా 76 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్‌లో సర్పంచులు, వార్డు సభ్యులు, చైర్‌పర్సన్‌లు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. పేద కుటుంబాలకు సరైన న్యాయం అందాలంటే మరోమారు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిదాలుగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఈ నెల 10న మక్తల్‌లో ఆవిష్కరించనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు వాల్‌పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, పార్లమెంటరీ సర్‌ ఇన్‌చార్జ్‌ రేణుకగౌడ్‌, మక్తల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుత్తా అమిత్‌, పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, డైరెక్టర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, ఫయాజ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement