మానవపాడు/ ఉండవెల్లి/ ఎర్రవల్లి: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి వంటి సంప్రదాయ పంటలు కాకుండా.. లాభదాయకమైన కూరగాయలు, పామాయిల్, పప్పుదినుసులు వంటివి సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్ అన్నారు. గురువారం ఆయన మానవపా సూచించారు. గురువారం ఆయన మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లిలోని పలు గ్రామాల్లో పర్యటించి పామాయిల్ తోటలు, ఇతర పంటలను పరిశీలించారు. అలాగే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం ద్వారా రాయితీ పొందిన రైతు నాగన్న కంది పంటను, బీచుపల్లి ఆయిల్‌పాం నర్సరీని పరిశీలించారు. జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పనులను అధికారులకు వివరించారు. అనంతరం జిల్లాలో సాగవుతున్న ఉద్యాన, వ్యవసాయ పంటలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తరణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. అంతకు ముందు బీచుపల్లి అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప, ఉద్యానవన అధికారి రాజ్‌కుమార్, ఏడీఏ శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాలను కార్యదర్శి సురేంద్రమోహన్ దర్శించుకున్నారు. ముందుగా ఆయన బాలబ్రహ్మేశ్వరస్వామి, తర్వాత జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. అధికారులు వారిని శాలువాతో సత్కరించారు.


