● రోజురోజుకు తెరపైకి వస్తున్న కొత్త అంశాలు
● భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల
వరకు..
ఆరోపణలపై చర్చ
● వాస్తవాలు
తేలాలంటే సమగ్ర విచారణే మార్గం
ఎస్‌ఐ పాత్రపై ఆరోపణలు
సదరు ఉన్నతాధికారికి సంబంధించిన పలు వ్యవహారాలను ఆ ఎస్‌ఐ పర్యవేక్షించేవారని పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో గద్వాల–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పేకాట స్థావరా లపై జరిగిన దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంలోనూ ఇద్దరి పాత్రపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అలాగే నెలవారీ వసూళ్ల వ్యవహారంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించేవారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఎస్‌ఐ గతంలో అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీకి పట్టుబడి.. అనంతరం కొంతకాలం వీఆర్ లో ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే కీలక పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలు న్నార ుు. అనంతరం ఓ జిల్లాలో ఏడాది పాటు పనిచేసి, ఆరోపణల నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా అక్కడ రెండు నెలలు పూర్తికాకముందే మరోసారి వనపర్తి జిల్లాకు బదిలీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తీవ్రస్థాయిలో ఆరోపణలపై ఓ
ఉన్నతాధికారిపై సీఐడీ విచారణ!
గద్వాల/మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్‌పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్‌ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది.
సీఐడీ విచారణ అంశం తెరపైకి రావడంతో గద్వాల జిల్లాలోనూ గతంలో జరిగిన పలు వ్యవహారాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఓ రేంజ్ స్థాయి అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఆయనకు మధ్యవర్తులుగా కొందరు డివిజన్ స్థాయి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయి అధికారులు వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌శాఖలో విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు, నెలవారీ నేర నివేదికలు, సమీక్షలు తదితర అంశాలు అధికారుల పనితీరుకు ప్రామాణికాలుగా ఉంటాయి. అయితే కొందరు అధికారులకు పోస్టింగులు, ఇతర ప్రయోజనాల విషయంలో అనధికారిక లావాదేవీలు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి. నెలవారీ మామూళ్ల విషయంలోనూ ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వాటి వాస్తవాలను అధికారిక విచారణలో నిర్ధారించాల్సి ఉంది.
గద్వాలపై ప్రత్యేక దృష్టి


