ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి

Aug 18 2026 1:03 AM | Updated on Aug 18 2026 1:03 AM

గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌తో కలిసి ప్రజల నుంచి 41 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికి అప్పుడు పరిష్కరించాలన్నారు. అలాగే మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు. తమ శాఖల పరిధిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లాలో సీఎం ప్రజావాణికి వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు 244 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 57 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలని, అలసత్వం చూపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement