తేళ్లను దైవ స్వరూపంగా కొలిచే సంప్రదాయం రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా గురిమిట్కల్ మండలం కందుకూరులో కొనసాగుతోంది. శ్రావణ పంచమి సందర్భంగా సోమవారం కొండమాయి కొండపై తేళ్ల
పంచమిని వైభవంగా నిర్వహించారు. కొండమవ్వకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు గుట్టపై రాళ్లను తొలగిస్తూ తేళ్లను పట్టుకున్నారు. జాతర రోజున కొండమాయి అమ్మవారి
కృపతో తేళ్లు కుట్టవని భక్తుల విశ్వాసం. అయితే తేలు కాటుకు సంప్రదాయ పద్ధతులను
కాకుండా వైద్య చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. – నారాయణపేట
ఎర్రవల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ప్రజావాణి ప్రోగ్రామింగ్ రాష్ట్రస్థాయి అధికారి సహదేవుడు అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన సందర్శించి.. ప్రజల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా.. ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడూ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదు పరిష్కరణ అనంతరం సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయడంతోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అమీర్‌పాష, ఏఓ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


