చెక్ డ్యాంల వివరాలు ఇలా..
జిల్లాలో ఎక్కడికక్కడ శిథిలమైన చెక్‌డ్యాంలు
–8లో u
అయిజ: వాగులు, వంకల్లో పారుతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి.. భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చెక్‌డ్యాంలను నిర్మించింది. ఈ క్రమంలో జిల్లాల పునర్ విభజన అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోకి మొత్తం 20 చెక్‌డ్యాంలు వచ్చాయి. అయితే జిల్లాలో పరిధిలోని మొత్తం 7 చెక్‌డ్యాంలు శిథిలమై.. సైడ్‌వాల్స్ కొట్టుకుపోయాయి. కానీ, వీటికి కనీసం మరమ్మతు చేయాలనే ఆలోచన కూడా అధికారులు చేయడం లేదు. ఫలితంగా వర్షపునీరు వృథాగా పారుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
భారీ వర్షాలకు తెగి..
2021లో చెక్‌డ్యాంలు నిర్మించడంతో కొన్ని సంవత్సరాలపాటు వాగుల్లో సమృద్ధిగా నీరు నిలిచి చుట్టుపక్కల భూగర్భజలాలు పెరిగి.. రైతులు పంటలు పండించుకునేందుకు బాగా ఉపయోగపడ్డాయి. అలాగే ఎండాకాలంలోనూ మూగజీవాల దాహం తీర్చేందుకు ఈ చెక్‌డ్యాంలు కీలకంగా మారాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో కొన్ని చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ తెగిపోగా.. మరికొన్ని చెక్‌డ్యాంలు నాసిరకం కట్టడాల వల్ల శిథిలమయ్యాయి. వాటికి మరమ్మతు చేపట్టకపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాగుల్లో నీరు నిలువని పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో కనీసం పశువులు దాహం తీర్చేందుకు కూడా నీరు లేకపోవడంతో అల్లాడుతున్నాయి. శిథిలమైన చెక్‌డ్యాంలకు మరమ్మతు చేయాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నా కనీసం స్పందన కరువైంది.
ఏళ్లతరబడిగా మరమ్మతు
చేపట్టని అధికారులు
వాగుల్లో చుక్క నిల్వ
ఉండని వర్షపు నీరు
పరివాహకంలో పెరగని భూగర్భజలాలు
రైతుల వినతులు పట్టించుకోని
యంత్రాంగం
మండలం చెక్‌డ్యాంలు శిథిలమైనవి
అయిజ 4 2
మానవపాడు 13 2
ఇటిక్యాల 1 1
వడ్డేపల్లి 2 2


