సమస్యల వాణి.. చెప్పుకొనే వేదికేది? | - | Sakshi
Sakshi News home page

సమస్యల వాణి.. చెప్పుకొనే వేదికేది?

Mar 20 2026 9:26 AM | Updated on Mar 20 2026 9:26 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిషత్‌ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చేవారు. ఫలితంగా ఆయా సమస్యలు కొద్దో గొప్పో పరిష్కారానికి నోచుకునేవి. కానీ, ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు జరపకపోవడంతో మండల పాలకవర్గాలు లేవు. దీంతో గత డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలా చెప్పాలి..

గడువు ముగిసిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఎవరికి విన్నవించాలో తెలియని స్థితిలో సర్పంచ్‌లు

గతంలో మూడు నెలలకోసారి మండల సభలు

ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో అయోమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement