జోగుళాంబ గద్వాల
గద్వాలన్యూటౌన్/రాజోళి/ఎర్రవల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని బుధవారం నుంచే జిల్లాలోని ఆలయాలు సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. పట్టణాల నుంచి ప్రజలు గ్రామా లకు రావడంతో పాటు ఇంటర్ పరీక్షలు కూడా పూర్తవడంతో గ్రామాలు కళకళలాడుతున్నా యి. జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్, రథశాల, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్ని కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. గద్వాలతో పాటు అయిజ, రాజోళి, ఎర్రవల్లి, శాంతినగర్, అలంపూర్ పట్టణాల్లో సైతం ఉగాది హడావుడి కనిపించింది. ఉగాదిని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లను బలిస్తారు. అందుకుగాను ఆలయ నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయం, అహోబిల మఠం, శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం, నది ఆగ్రహారంలోని ఆలయాల వద్ద, జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన అలంపూర్, బీచుపల్లి, మల్దకల్, పాంగుంట, చింతరేవుల తదితర ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.
నేడు ఉగాది సంబురం
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
ప్రధాన ఆలయాల్లో పంచాగ శ్రవణం చేయనున్న పండితులు


