ప్రస్తుతం నేను తుమ్మిళ్లగా సర్పంచుగా ఉన్నాను. గతంలో ఎంపీటీసీగా కూడా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించేవారు. అప్పుడు అన్ని శాఖల అధికారులు హాజరై.. సమస్యలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం సమస్యలు ఎవరికో చెప్పాలో తెలియడం లేదు. ప్రతి సమస్యను ప్రజావాణిలో తెలిపేందుకు గద్వాలకు వెళ్లాలంటే ఇబ్బంది. గత వారంలో ఇదే విషయంపై ఎంపీడీఓను కలిసి వివరించాను.
– అడివప్ప, సర్పంచ్, తుమ్మిళ్ల, రాజోళి మండలం
●


