వంటగ్యాస్‌ కొరత లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ కొరత లేకుండా చర్యలు

Mar 14 2026 7:40 AM | Updated on Mar 14 2026 7:40 AM

గద్వాల: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశమై వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై సమీక్షించారు. జిల్లాలోని గ్యాస్‌ ఏజెన్సీలు గృహ సంబంధ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యావేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో యాసంగి సీజన్‌లో పంటలు సాగుచేసుకున్న రైతులకు ఇబ్బంది తలెత్తకుండా సాగునీరు సరఫరా చేయాలన్నారు. పంటలకు స్టోరేజ్‌ పాయింట్స్‌ కొ రత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నా రు. అదే విధంగా ఆయిల్‌పాం సాగును పెంచేందు కు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనా రాయ ణ, సివిల్‌సప్లయ్‌ అధికారులు స్వామికుమా ర్‌, విమల, డీఏఓ వీరప్ప, ఎస్‌ఈ రహీముద్దీన్‌, ఈఈ శ్రీనివాస్‌, ఉద్యానశాఖ అధికారి అక్బర్‌ ఉన్నారు.

పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా సవరణ

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేస్తామని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు. ఇదే విధంగా కొనసాగిస్తూ నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పెండింగ్‌లో ఉన్న డీఎస్‌ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు అంకితాభావంతో పనిచేయాలని.. మండల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ హరికృష్ణ, సూపరింటెండెంట్‌ మంజుల, ఎన్నికల విభాగం అధికారి సురేశ్‌ పాల్గొన్నారు.

పకడ్బందీగా ‘పది’ పరీక్షలు

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులతో పాటు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు చొరవ చూపాలన్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, డీఈఓ విజయలక్ష్మి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement