యువతకు ఉపాధి లభిస్తుంది.. | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి లభిస్తుంది..

Mar 14 2026 7:40 AM | Updated on Mar 14 2026 7:40 AM

గతంలో ఆయిల్‌ మిల్లు ఏర్పాటుకోసం కొండపేట, యాక్తాపురం గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములను దానం చేశారు. వారి కుటుంబాలకు మిల్లులో ఉద్యోగాలు సైతం కల్పించారు. ప్రస్తుతం మా గ్రామపంచాయతీ పరిధిలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆయిల్‌ మిల్లు ప్రారంభమైతే వారికి ఉపాధి దొరుకుతుంది.

– విజిత, సర్పంచ్‌, బీచుపల్లి

ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైతులు లాభదాయక ఆయిల్‌పాంను సాగుచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆయిల్‌పాం సాగుచేసే రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి.

– అక్బర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి

త్వరలోనే ప్రారంభం..

బీచుపల్లి ఆయిల్‌ మిల్లులో రూ. 47కోట్ల వ్యయంతో మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఈటీపీ వంటి పనులు ప్రారంభమయ్యాయి. మిల్లులోని 11 భవనాల్లో ఎన్‌డీటీ బృందం నాణ్యతా ప్రమాణ పరీక్షలు నిర్వహించింది. రైతు సేవాకేంద్రం నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. రైతులకు ఆయిల్‌పాం పంటలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఆయిల్‌పాం సాగుకు అవసరమైన డ్రిప్‌, ఎరువులు, హార్‌వెస్టింగ్‌, ఇతర పరికరాలను కూడా త్వరలోనే ఆయిల్‌ మిల్లులో అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

– సుధాకర్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్‌,

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement