పునరావాస కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గట్టు: చిన్నోనిపల్లె పునరావాస కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో మిషన్ భగీరథ సంపు ప్రారంభించడంతో పాటు ిసీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా చిన్నోనిపల్లె, ఆలూరు గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గట్టు మండలం ఏడారిగా ఉండేదని.. ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో పచ్చని పంటలతో కళకళలాడుతోందన్నారు. చిన్నోనిపల్లె నిర్వాసితుల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పునరావాస కేంద్రంలో ఇంటి స్థలాల పట్టాలు అందిస్తామన్నారు. పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించి.. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, ఆనంద్‌గౌడ్, నర్సన్నగౌడ్, తిమ్మప్ప, రామాంజనేయులు, చంద్రశేఖర్, అలీ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
(24జీడీఎల్–401)


