రవాణా సౌకర్యం మెరుగు..
ఆత్మకూర్ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10 కిలోమీటర్లకు ఆత్మకూర్ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించే ప్రదేశం


