పండ్లతోటల వైపు.. రైతన్న చూపు | - | Sakshi
Sakshi News home page

పండ్లతోటల వైపు.. రైతన్న చూపు

Nov 23 2025 9:03 AM | Updated on Nov 23 2025 9:03 AM

పండ్లతోటల వైపు.. రైతన్న చూపు

పండ్లతోటల వైపు.. రైతన్న చూపు

అయిజ: ఇంతకాలం ఆహార ధాన్యాలు, పత్తి, పొగాకు, ఆముదం పంటలు పండించిన రైతన్నలు.. ప్రస్తుతం పండ్లతోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు బీడు భూములుగా కనిపించిన పొలాల్లో పండ్లతోటలు పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ పొలాలు పండ్లతోటలకు అనువుగా ఉండటం.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో పండ్లతోటల సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి, సీతాఫలం మొదలగు పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. ఇది కేవలం అన్నదాతల ఆదాయం పెంచడమే కాదు.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది.

బి.తిమ్మాపూర్‌లో సాగుచేసిన బత్తాయి తోట

మార్కెట్‌ సౌకర్యాలు, నాణ్యత నియంత్రణ, పండ్ల ధరల అస్థిరత్వం రైతులకు సవాల్‌గా మారుతున్నాయి. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఎక్స్‌పోర్ట్‌ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. అన్నదాతలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లా తెలంగాణ ఫ్రూట్‌ బౌల్‌గా మారే అవకాశం ఉంది. పండ్ల తోటలపై ఆశలు పెట్టుకున్న రైతన్నలకు ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే రాష్ట్ర ఉద్యాన రంగంలో జిల్లా మరింత ముందుండనుంది.

బత్తాయి 110

డ్రాగన్‌ ఫ్రూట్‌ 10

జామ

6

దానిమ్మ

5

సీతాఫలం : 5

నిమ్మ : 8

మెండగా లాభాలు..

రైతులు ప్రభుత్వం అందించే 40 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకొని పండ్ల తోటలు సాగుచేస్తే అనేక లాభాలు ఉంటాయి. తోటలు కాపుకొచ్చినప్పటి నుంచి సుమారు 20 నుంచి 30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. ఇతర పంటలతో పోల్చితే కూలీల అవసరం చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. – ఎంఏ అక్బర్‌ బాషా,

జిల్లా ఉద్యానశాఖ అధికారి

మూడేళ్లలోనే 40శాతం మేర..

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 215 హెక్టార్లలో వివిధ రకాల పండ్ల తోటలు సాగయ్యాయి. మూడేళ్ల కాలంలోనే ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 40 శాతం పెరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలంపూర్‌, వడ్డేపల్లి, ఇటిక్యాల, గట్టు, ఉండవెల్లి మండలాల్లో మామిడి తోటలు విస్తృతంగా సాగుచేస్తున్నారు. అదే విధంగా గద్వాల, ధరూరు ప్రాంతాల్లో దానిమ్మ, సీతాఫలం సాగుచేస్తుండగా.. అయిజ మండలంలో ఎక్కువగా బత్తాయి తోటలు పండిస్తున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతో..

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్‌), రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) పథకాలను అమలు చేస్తున్నాయి. తోటల సాగు చేపట్టే రైతులకు ఉద్యానశాఖ ద్వారా 40 శాతం రాయితీలను అందిస్తున్నాయి. అందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరం 252 యూనిట్లు మంజూరు చేస్తూ.. రూ. 1.7కోట్లు కేటాయించాయి. ఉద్యాన ప్రోత్సాహక పథకాలు చిన్న, సన్నకారు రైతులకు ఊతమిస్తున్నాయి. మామిడి, దానిమ్మ, సీతాఫలం మొక్కలకు 75 నుంచి 90శాతం, డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటున్నారు.

సౌకర్యాలు లేక ఇబ్బందులు..

జిల్లాలో పెరుగుతున్న ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం

ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఈ ఏడాది 215 హెక్టార్లలో సాగు

సబ్సిడీతో లబ్ధి పొందుతున్న అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement