చారిత్రక వైభవం..
నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన కట్టడాలు
అందరికీ
అందుబాటులోకి తెస్తేనే..
గ్రామాల్లో పర్యటించి పరిశోధన ద్వారా తెలుసుకున్న చరిత్రకు భావితరాలకు అందించేందుకు పుస్తకాలు, రచనలు, డాక్యుమెంట్ల రూపంలో వెలుగులోకి తేవాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. ఇది పూర్తిగా ప్రొఫెసర్లు, డిగ్రీ విద్యార్థులు, ఔత్సాహిక పరిశోధకులు స్వచ్ఛందంగా చేపట్టాల్సి రావడంతో చాలావరకు గ్రామాల పర్యటన, చరిత్ర పరిశోధన ఆశించినంత సాగడం లేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బిజినేపల్లి మండలం వట్టెంలోని గడి
మన ఊరు – మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా చాలా వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేపట్టాం. పలుగ్రామాల చరిత్ర పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో మనకు తెలియని కొత్త చరిత్ర బహిర్గతమవుతోంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, వివక్ష తదితర అంశాలు తెలుస్తున్నాయి. – పెబ్బేటి మల్లికార్జున్, ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్)
చాలా కొత్త విషయాలు తెలిశాయి..
చారిత్రక వైభవం..


