పేదల సొంతింటి కల నెరవేరుస్తాం..
ఇటిక్యాల: పేదోడి సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల పరిధిలోని శివనంపల్లిలో వడ్డె సరోజమ్మకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డెప్ప, స్థానిక నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట నెరవేరుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లాలోనే మొదటి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రుక్మందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకలు లక్ష్మీనారాయణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రాజు, మద్దిలేటి పాల్గొన్నారు.


