
కదలిక వచ్చేనా?
●
అమలు చేయాలి
గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రేమ్ మగ్గాల ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలి. ఆ పథకంతో కార్మికులకు మేలు జరుగుతుండటంతో వాటిని కొనసాగిస్తే బాగుంటుంది. ఫ్రేమ్ మగ్గాలను ఇవ్వడం వల్ల కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పథకం అమలు చేయాలి.
– మంజు, చేనేత కార్మికుడు, రాజోళి
దరఖాస్తులు మళ్లీపరిశీలించాలి
ప్రభుత్వాలు మారినప్పటికీ చేనేత కార్మికుల జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్మికులు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించాలి. ఫ్రేమ్ మగ్గాలు వస్తే వయసు మళ్లిన వారు కూడా మగ్గం నేయడంలో ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతారు. దరఖాస్తులు పాతవే. పథకం పాతదే అనుకోకుండా కార్మికులకు నూతన ఉత్తేజం ఇచ్చేలాగా ఈ పథకాన్ని అమలులోకి తేవాలి.
– కర్జి ఖాజా,చేనేత కార్మికుడు రాజోళి
ప్రభుత్వం నుంచి
ఆదేశాలు వస్తే..
గతంలో ఫ్రేమ్ మగ్గాల కోసం కార్మికుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో దానిపై కదలిక రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం దానిపై ఆదేశిస్తే వవెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేస్తాం.
– గోవిందయ్య, చేనేత జౌళి శాఖ ఏడీ
బహుళ ప్రయోజనాలిచ్చే ఫ్రేమ్ మగ్గాలపై కార్మికులకు ఆశలు
రాజోళి:గుంత మగ్గంతో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు గతంలో తీసుకువచ్చిన ఫ్రేమ్ మగ్గం ప్రతిపాదన ప్రస్తుతం అటకెక్కినట్లుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంత మగ్గాలు ఉన్న వారికి సబ్సిడీ కింద ఈ ఫ్రేమ్ మగ్గాలను అందిస్తే వచ్చే బహుళ ప్రయోజనాల ద్వారా వారికి ఉపాధి పెంచుతామని గత ప్రభుత్వం చెప్పడంతో కార్మికుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కానీ అప్పట్లో తీసుకున్న దరఖాస్తుల తర్వాత మళ్లీ దానిపై ఎక్కడా ప్రభుత్వం నుంచి కూడా ప్రకటనలు రాకపోవడంతో చేనేత కార్మికులు నిరాశ చెందుతున్నారు.
2వేలకు పైగా దరఖాస్తులు
చేనేత రంగంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో కార్మికులకు కూడా మగ్గాల్లో మార్పులు చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చూసేందుకు ఇలాంటి మగ్గాలను తెస్తున్నామని గత ప్రభుత్వం ఫ్రేమ్ మగ్గాలను ప్రతిపాదించింది. దాని కోసం చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు కోరింది. గత ఏడాదిలో సెప్టెంబర్ 14 నాటికి చివరి తేదీగా నిర్ణయించింది. అనంతరం లబ్దిదారుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఆ సమయానికి 6,948 మంది చేనేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ ప్రకారం 2,695 మగ్గాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా గుంత మగ్గాలే కావడంతో 2 వేల మందికి పైగా కార్మికులు ఫ్రేమ్ మగ్గాలకు దరఖాస్తు చేసుకున్నారు.
సబ్సిడీపై ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు
జిల్లాలో 2వేలకు పైగా దరఖాస్తులు
ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్న వైనం

కదలిక వచ్చేనా?

కదలిక వచ్చేనా?