
తేలిన లెక్కలు!
రూ.7.80 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్
ఆర్‌ఆర్‌యాక్టు కింద నోటీసులు
ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో రూ.7.80 కోట్ల ఽఽవిలువ గల ధాన్యానికి సంబంధించి రికవరీ చేసేందుకు ఆర్‌ఆర్ యాక్టు కింద రైస్‌మిల్లు ఓనర్ వీరన్నకు నోటీసులు జారీ చేస్తాం. నోటీసులకు స్పందించకపోతే నిబంధనల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు రైస్‌మిల్లు ఓనర్ వీరన్న నుంచి రూ.7.80 కోట్ల విలువ గల ఆస్తులను జప్తు చేస్తాం. – హరికృష్ణ, తహసీల్దార్, కేటీదొడ్డి
క్రిమినల్ కేసు
విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రూ.7.80 కోట్ల విలువ గల ధాన్యానికి సంబంధించి ఆర్‌ఆర్ యాక్టు కింద రికవరీ చేయాలని కేటీదొడ్డి తహసీల్దార్‌కు సిఫారసు చేశాం. అలాగే, ప్రస్తుతం రైస్‌మిల్లులో మిగిలి ఉన్న ధాన్యాన్ని వేరే మిల్లుకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ సొమ్మును కాజేసిన నేపథ్యంలో సదరు మిల్లర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. దీనిపై ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గం.
– విమల, సివిల్‌సప్‌లై డీఎం, గద్వాల
గద్వాల: జిల్లాలో అవినీతి సామ్రాట్‌గా అవతారమెత్తిన రైస్ మిల్లు యజమాని నందిన్నె వీరన్న ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో రూ.7.80 కోట్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి జేబు నింపుకొన్నట్లు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి గుర్తించారు. ఇందుకు సంబంధించి సివిల్‌సప్‌లై శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కేటీదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో సదరు మిల్లు యజమానిపై ఆర్‌ఆర్ యాక్టుకింద కేసు నమోదు కావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ మిల్లు ఓనర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.50కోట్ల విలువ ధాన్యాన్ని తీసుకుని వాటిని దర్జాగా దొంగమార్గంలో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొట్టాడు. ఈక్రమంలోనే గత నెలా ధాన్యంలోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని అధికారులకు అప్పగించడంతో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు మిల్లు యజమాని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ‘సాక్షిశ్రీలో వరుస కథనాలు, విజిలెన్స్ అధికారుల విచారణ వెరసి ఎట్టకేలకు సదరు రైస్‌మిల్లు ఓనర్‌పై రూ.7.80 కోట్ల ప్రభుత్వం ధాన్యం కాజేసినట్లు గుర్తించి ఆర్‌ఆర్‌యాక్టు కింద కేసు నమోదైంది.
విజిలెన్స్ విచారణలోవెలుగులోకి అక్రమాలు
ఆర్‌ఆర్ యాక్టు కింద కేసు నమోదు
కేసు నమోదు కాకుండా
శతవిధాలా ప్రయత్నం
సదరు మిల్లుకు మూడు సీజన్లలో రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు
‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం
మిల్లుకు రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు
నందిన్నె రైస్‌మిల్లుకు 2022 రబీలో 1425 మెట్రిక్ టన్నుల ధాన్యం, 2024 ఖరీఫ్‌లో 5948 మె.టన్నులు, 2024–25 రబీలో 10,294 మె.టన్నులు మొత్తం రూ.50కోట్ల విలువ గల ధాన్యాన్ని సివిల్‌సప్‌లై శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 2024 ఖరీఫ్, రబీకి సంబంధించి కేవలం రూ.10 కోట్ల విలువ గల సీఎమ్మార్ మాత్రమే ప్రభుత్వానికి అందించగా.. 2022 రబీకి నిర్వహించిన టెండర్ సరుకు ఇంకా అప్పజెప్పలేదు. మొత్తంగా రూ.40కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.

తేలిన లెక్కలు!