
ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
గద్వాలటౌన్: ఒలింపిక్స్ హాకీలో 8 పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ప్రపంచ నలమూలల వ్యాపింపజేసిన హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఉన్న ధ్యాన్‌చంద్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులనుద్ధేశించి మాట్లాడారు. ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. భారత అత్యున్నత క్రీడా అవార్డు ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నశ్రీగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రీడలను అలవర్చుకుని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని సూచించారు.
ఉత్సాహంగా ర్యాలీ
క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ఐక్యావేదిక, గద్వాలలోని వివిధ క్రీడా సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం లాంగ్‌లీవ్ స్పోర్ట్స్.. అందరికీ క్రీడలు – అందరికీ ఆరోగ్యం అంటూ క్రీడాకారులు, వ్యాయమ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నినదించారు. క్రీడాజ్యోతితో పలవురు క్రీడాకారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు ప్రతిజ్ఞగా చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ జితేందర్, వివిధ క్రీడా సంఘాల కోచ్‌లు, వ్యాయా మ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బాలబ్రహ్మేశ్వర ఆలయంలో కర్ణాటక మంత్రి పూజలు
అలంపూర్‌రూరల్: జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని కర్ణాటక రాష్ట్ర చిన్న నీటిపారుదల, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి బోసురాజు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ దంపతులు బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో వారికి స్వాగతం పలికి మంత్రి దంపతులతో కుంకుమార్చన, పూజా కార్యక్రమాలను చేయించారు. అర్చకులు మంత్రికి శేష వస్త్రాలతో సత్కరించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ఈఓ దీప్తి ఽమార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్‌చైర్మన్ కుమార్, ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.
మాతృ భాషలోవిద్యాబోధన జరగాలి
గద్వాలటౌన్: పట్టణంలోని పలు విద్యా సంస్థలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షేక్ కలందర్ బాషా పాటు పలవురు తెలుగుబాష కొవిదులు పాల్గొని తెలుగు భాషా వికాసానికి తోడ్పడతామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు భాషలో విద్యాబోధన జరగాలని కోరారు. మాతృ భాషలో విద్యాబోధన జరిగినప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. అనంతరం విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఉండవెల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్డీఓ అలివేలు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని మహాత్మాజ్యోతి బాపులే గురుకుల పాఠశాలను ఆర్డీఓ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం లేదని, సరిపడా మూత్రశాలలు లేవని, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టారు. ఆయా సమస్యలపై ప్రిన్సిపాల్‌తో ఆరా తీశారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, శుద్ధమైన తాగునీరు అందించాలని ఆదేశించారు.
వేరుశనగ క్వింటా రూ.5,012
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యా ర్డుకు శనివారం 44 క్వింటాళ్ల వేరుశనగ వ చ్చింది. గరిష్టం రూ. 5012, కనిష్టం రూ. 356 9, సరాసరి రూ. 4669 ధరలు లభించాయి.