
పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి
గట్టు: గ్రామంలో అన్ని కులాల వారు కలసి మెలసి జీవించాలని, కులమత భేదాలను పాటించకుండా అన్ని పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని గద్వాల ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య సూచించారు. శనివారం రాయాపురంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించగా.. వారు ముఖ్య అథితులుగా హాజరై మాట్లాడారు. ప్రతి పండుగలను కలసిమెలసి జరుపుకోవాలని, కులమతాల పట్టింపులు ఉండకూడదని, అందరూ సమానమేనని, కుల వివక్షతను పాటించవద్దని అన్నారు. అంటరానితనం పాటించడం నేరమని, కులాల మద్య చిచ్చు పెట్టేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు గ్లాసుల విధానం గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో సినియర్ అసిస్టెంట్ నాగిరెడ్డి, గిర్దావర్లు రాజు, షేక్షావలి, ఎస్‌ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,020
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యా ర్డుకు శనివారం 79 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5020, కనిష్టం రూ. 3097, సరాసరి రూ. 4629 ధరలు లభించాయి.