చెక్‌పోస్టు వద్ద కొనసాగుతున్న తనిఖీలు
రాజోళి: మండలంలోని తుంగభద్ర నదిపై గల సుంకేసుల డ్యాం వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ చెక్‌పోస్టు ఏర్పాటుచేసిన విషయం విధితమే. ఏపీ తదితర ప్రాంతాల నుంచి ఆవులు, పశువులను తీసుకువెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశమున్నందున ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా వీఎల్‌ఓ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో ఆవులు, పశువులు ఉన్నట్లయితే వాటికి సంబందించిన రశీదులు, అనుమతి పత్రాలు ఉన్నాయా, లేదా ఆరా తీస్తున్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని వారు హెచ్చరించారు.


