నీటి వృథాకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

నీటి వృథాకు అడ్డుకట్ట

May 26 2025 12:30 AM | Updated on May 26 2025 12:30 AM

నీటి

నీటి వృథాకు అడ్డుకట్ట

సుమారు 30 ఏళ్ల కిందట..

జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్‌పాడు రిజర్వాయర్‌ వరకు సాగునీటిని వదిలారు.

పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతు

నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం

వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు

ఎట్టకేలకు మోక్షం

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు.

సమాంతర కాల్వకు మోక్షమెన్నడో?

భీమా ఫేజ్‌–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్‌ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

నీరు వృథా అయ్యేది..

జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లు పూర్తిగా దెబ్బతినడంతో నీరు కాల్వలో వృథాగా పారేది. అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టడంతో వేసవిలో జలాశయంలోని నీటిమట్టం తగ్గకుండా ఉంటుంది.

– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత

పనులు పూర్తి చేశాం..

జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేశాం. మరమ్మతులను డీఈ నారాయణ పర్యవేక్షించారు. ఇకపై కాల్వకు నీరు నిలిపితే షట్టర్ల నుంచి లీకేజీ కాకుండా పక్కాగా పనులు చేపట్టాం. వారబందీ విధానంలో పూర్తిస్థాయిలో నీటిని అందించే సమయంలో సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

– జగన్మోహన్‌, ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డ్యాం డివిజన్‌

నీటి వృథాకు అడ్డుకట్ట 1
1/3

నీటి వృథాకు అడ్డుకట్ట

నీటి వృథాకు అడ్డుకట్ట 2
2/3

నీటి వృథాకు అడ్డుకట్ట

నీటి వృథాకు అడ్డుకట్ట 3
3/3

నీటి వృథాకు అడ్డుకట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement