జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: ఈనెల 25వ తేదీ ఆదివారం గ్రామ పాలన అధికారి రాతపరీక్ష (జీపీఓ)కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం సీసీఎల్‌ఏ కార్యదర్శి నవీన్‌మిట్టల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొత్తం 81మంది అభ్యర్థులు పరీక్ష హాజరు కానున్నారని తెలిపారు. వీరికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు కొనసాగతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. అదేవిధంగా కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఏవో నరేందర్, తహసీల్దార్ మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.


