
ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందం విస్తృత్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాత, కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు తదితర ప్రాంతాల్లో పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ఆధ్వర్యంలో అనుమానం ఉన్న బ్యాగ్‌లు, స్థలాలను నిషేధిత పదార్ధాలను గుర్తించేందుకు యంత్రాలతో తనిఖీలు చేశా రు. శత్రు దేశంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైన ఉంటే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా వారు తెలిపారు. అయితే పోలీసులు విస్తృత్తంగా తనిఖీలు చేపట్టడంతో పలువురు ఆందోళన చెందారు.
మెరుగైన వైద్యసేవలు
అందించాలి
ఇటిక్యాల: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని.. వైద్య సిబ్బంది సైతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సంధ్య కిరణ్మయి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విష జ్వరాలతో పాటు వివిధ వ్యాధులకు సంబందించిన మందులు, పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకొని ఇబ్బందులు పడాల్సిన అవనరం లేదన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న 102 సేవలను వినియోగించుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, ఎండాకాలం నూలు వస్త్రాలు ధరించాలని, ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డిడిఈఓ రామాంజనేయులు, మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, పాల్గొన్నారు.
ఇష్టానుసారంగా ఎరువులు
వినియోగించొద్దు
గద్వాల వ్యవసాయం: ఇష్టానుసారంగా ఎరువులను వినియోగించరాదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. గురువారం గద్వాల మండలంలోని కొండపల్లి రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా ఎరువులను వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని, సిఫారసు చేసిన ఎరువులను మోతాదు మేరకు మాత్రమే వినియోగించాలని అన్నారు. సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ, వివిధ పంటలలో నూతన సాంకేతికతను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చునని అన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ మాట్లాడుతూ.. ఎప్పుడు ఒకే రకమైన పంటలు వేయకుండా, పంట మర్పాడి తప్పక చేయాలని సూచించారు. పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకోవడం వల్ల అధిక లాభాలు వస్తాయని చెప్పారు. అంతకుముందు ప్రాంతీయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ నళిని యూరియా వినియోగం, సాగు ఖర్చులు తగ్గించుకునే విధానాలు, పంట మార్పిడి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదులను భద్రపర్చడం, సాగునీటి ఆదా, చెట్లను పెంచడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఆదినారాయణ రెడ్డి, ఆయిల్‌ఫామ్ ఫెడరేషన్ అధికారి శశిధర్‌గౌడ్, మండల వ్యవసాయ, ఉధ్యానశాఖల అధికారులు, విస్థరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు