‘ప్రతిభ’ విద్యార్థుల విజయఢంకా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో వైష్ణవి 468, ఉపేంద్ర 468, విజయలక్ష్మి 467, గణేశ్ 467, అక్షితారెడ్డి 467, సాయిచరణ్ 467, కీర్తి 466, భవనేష్ 466, అయిసా తహరీన్ 466, హర్షిత 466, వర్షిణి 466, హూరియా రశీద్ 466, విశాల్ 466, శోభారాణి 466, నవీన్‌కుమార్ 466, శ్రీనితీన్ 466, త్రిష 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో నెక్కొండ హాసి 436, వైష్ణవి 436, సుప్రజ 435 మార్కులతో ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అక్షిత 994, అమోఘ్ 993, భవిత 992, శివజ్యోతిక 992, అమిమ ఫాతిమా 992, వర్షిత్‌గౌడ్ 992 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో అక్షిత 994, అజీం కౌసర్ 991, జైన్‌బిన్ మొహమ్మద్ 990, భూమిక 990 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో 400 పైగా 514మంది, ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులకు పైగా 432 మంది సాధించినట్లు యాజమాన్యం పేర్కొంది.


