
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ట్రాఫిక్ సిబ్బందికి నూతనంగా వచ్చిన పరికరాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని వాహనదారులు సామర్థ్యానికి మించి స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ వారు ప్రమాదాలకు గురవుతూ.. ఇతరులను వాటి బారిన పడేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ పలు అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు 10 ఫ్లెక్సిబుల్ ఐరన్ బారికేడ్స్, 10 రిఫ్లెక్ట్ జాకెట్స్, 10 బ్రీత్ అనలైజర్స్ తదితర వాటిని ట్రాఫిక్ సిబ్బందికి అందజేశామన్నారు. జిల్లాలోని ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ట్రాఫి క్ ఎస్‌ఐ బాలచంద్రుడికి పరికరాలను అందజేశారు.