గద్వాల డిపో మేనేజర్‌గా సునీత
గద్వాల క్రైం: ఆర్టీసీ గద్వాల డిపో మేనేజర్‌గా సునీత బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరిస్తానని, సంస్థ అభివృద్ధికి ప్రతిఒక్క రూ సహకరించాలన్నారు. మేనేజర్‌కు సిబ్బంది పూలబొకే అందజేసి స్వాగతం పలికారు.
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి
గద్వాల: ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి నిర్ధేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు. బుధవారం గద్వాల మండల పరిదిలోని చెనుగోనిపల్లి గ్రామంలోని ఉపాధి హమీ పనులను ఆయన పరిశీలించి కీలక సూచనలు అందించారు. అనంతరం గ్రామంలోని కోళ్ల షెడ్, పశువుల షెడ్ పరిశీలించి, నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్, కనీస వసతులు కల్పించాలని అన్నారు.
సీఎంను కలిసిన అర్చక
సంఘం నాయకులు
అలంపూర్: హైదరాబాద్‌లోని అసెంబ్లీ వద్ద అర్చక ఉద్యోగ సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మేశ్వర జోగుళాంబ అమ్మవా రి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ అర్చక సంఘం నాయకులతో కలిసి సీఎంను శాలువాతో సత్కరించారు. అర్చక ఉద్యోగ జేఏసీ డైరీని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు వారు తెలిపారు.
గద్వాల డిపో మేనేజర్‌గా సునీత


