గద్వాల: రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు కుర్వ పల్లయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్‌లో బడ్జెట్ పత్రాలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ విద్యావ్యవస్థను పాతాళానికి తొక్కేసిందన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.53శాతమే నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శమన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ రూపంలో రూ.8వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, ప్రస్తుతం బడ్జెట్‌లో కేవలం రూ.23,108కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. విదేశీ యూనివర్సిటీలలో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం సున్నా అన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్టున్న సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాజు, సందేష్, మాధవ్, నరేంద్ర, పవన్, జోయోల్, హరికృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.