గద్వాల క్రైం: వేసవి కాలంలో ప్రజలందరు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. గత వారం రోజల నుంచి జిల్లాలో ఎండ తీవ్రత దాటికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరు సరిపడా నీటిని తాగాలన్నారు. ఆహార అలవాట్లు, రోజు వారి శ్రమ తదితర విషయాలను సూర్యరశ్మి తీవ్రత ఉన్న సమయంలో ఉపశమనం తీసుకోవాలన్నారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీల శిక్షణకు ఎంపిక
గద్వాలటౌన్: ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జమ్ము కాశ్వీర్‌లో జరిగే జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీల శిక్షణ క్యాంపునకు గద్వాలకు చెందిన క్రీడాకారుడు బీచుపల్లి ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. గత నెల 21వ తేది నుంచి 24వ తేదీ వరకు వికారాబాద్‌లో జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలలో జిల్లా జట్టు తరపున బీచుపల్లి పాల్గొని ప్రతిభ కనబర్చారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో బీచుపల్లి క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీల శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అబ్రహాం, సెక్రటరి రవి, కోశాధికారి చందు, కరెంటు నర్సింహా, నగేష్, రైల్వేపాష, వెంకటన్న సీనియర్ క్రీడాకారులు హర్షం తెలిపారు.
ముగిసిన వట్టెం
వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఎదుర్కోళ్లు, స్వామివారి కల్యాణం, చతురస్త్రార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు చతురస్త్రార్చన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రాతారాధన, సేవాకాలం, రాజభోగం, పూర్ణాహుతి, నవ కలశ స్నపన చక్రతీర్థం అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణ, అర్చకులు శ్రీకర్, శేషసాయి, రంగనాథ్, ప్రసాద్, నర్సింహచార్యులు, నవీన్, తివారీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వారం రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి