
ధరణి దరఖాస్తులను క్లియర్ చేయండి
గద్వాల: జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షించారు. ప్రజావాణి, మీసేవ కేంద్రాలలో వచ్చిన ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలని అదేవిధంగా కుల, ఆదాయ, ఓబీసీ సర్టిఫికెట్లపై ప్రత్యేక శ్రద్ధఉంచి ఎప్పటికప్పు డు క్లియర్ చేయాలన్నారు. కొత్త రేషన్‌కార్డులు పొందిన కుటుంబాల వివరాలను సమర్పించాలన్నారు. బర్త్ సర్టిఫికెట్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ప్రొహిబిటెడ్, పెండింగ్ మ్యూటేషన్ సక్సెషన్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో నరెందర్, డీఎస్‌డీవో స్వామి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై..
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సీఆర్‌పీలతో మాట్లాడారు. గ్రామీణప్రాంతాల్లో ప్రజాసంఘాల శక్తిని పెంచడం, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం అదేవిధంగా స్థానిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో సామర్థ్యాన్ని పెంచేలా అవగాహన కల్పించాలన్నారు. ఈసమావేశంలో ఏపీఓ నర్సింహులు, సంగీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment