
సమీకృత మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలి
అయిజ: మున్సిపాలిటీలో రెండేళ్ల క్రితం రూ.2 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ నిర్మాణం నిరుపయోగంగా ఉందని, వినియోగంలోకి తీసుకరావాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు భగత్‌రెడ్డి కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులును బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈసందర్భంగా కమిషర్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పట్టణంలో ప్రతి గురువారం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నిర్వహించే సంత వలన అనేక ఇబ్బందులు కులుగుతున్నాయని తెలిపారు. చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు వారాంతపు సంతకు వస్తుంటారని, దానివలన ట్రాఫిక్ జామ్ అవుతుందని వాపోయారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు, కూరగాయలు తదితర వస్తువులు విక్రయించడం వలన వ్యర్థ పదార్థాలు రోడ్డున పారవేస్తున్నారని, దీంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. సమీకృత మార్కెట్ భవనంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి అక్కడ క్రయ, విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరయ్య చారి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.
బోధన విధానంలో మార్పు రావాలి
గద్వాలటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన విధానంలో మార్పులు రావాలని జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారిణి ఎస్తేర్‌రాణి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, మోమిన్‌మహల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరోజు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు ఉపయోగాలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నూతన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు. తద్వారా విద్య బోధన చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇందుకోసం ఎన్నో నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తుందన్నారు. కోర్సు డైరెక్టర్లు జహురుద్దీన్, వెంకటనర్సయ్య, శోభరాణిలతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల ఎంఆర్‌సీలు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,201
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 599 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టంగా రూ.6201, కనిష్టంగా రూ. 3070, సరాసరి రూ.4789 ధరలు పలికాయి. అలాగే, 77 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6899, కనిష్టం రూ.6089, సరాసరి రూ.6835 ధరలు వచ్చాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ఽరూ. 5539 ధరలు లభించింది.

సమీకృత మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలి
Comments
Please login to add a commentAdd a comment