రాజోళి: మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్ష గురువారం 15 వరోజుకు చేరింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఫ్యాక్టరీకి సంబందించిన ఆస్తులకు చిన్న పాటి నష్టం కలిగినా తమపై కేసులు నమోదు చేస్తున్నారని, రెవెన్యూ, పోలీసు అధికారులు తమపై దీక్షలు విరమించాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కాని తమ జీవనోపాధిగా ఉన్న వ్యవసాయాన్ని వదిలి ఫ్యాక్టరీని గ్రామంలో ఏర్పా టు చేయనివ్వమని అన్నారు. రానున్న భవిష్యత్తు పిల్లలదేనని అలాంటి వారికి అవసరమయ్యే వసతులను కోల్పోయే విధంగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, అలాంటి మహమ్మారిని గ్రామంలోకి రానివ్వమని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.