మరో అవకాశం.. | - | Sakshi
Sakshi News home page

మరో అవకాశం..

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

సద్వినియోగం చేసుకోవాలి

ఎస్‌ఐఆర్‌లో భాగంగా ముసాయిదాలో పేరులేని ఓటర్లు ఆందోళన చెందకుండా ఎన్నికల కమిషన్‌ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పేర్లు గల్లంతైన వారు, చిరునామా మారిన ఓటర్లు బీఎల్‌ఓను సంప్రదించాలి. గడువులో అవసరమైన పత్రాలు అందించి తిరిగి ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.

– హరికృష్ణ, భూపాలపల్లి ఆర్డీఓ

భూపాలపల్లి అర్బన్‌: ఓటరు జాబితాలో పేరు లేని వారు చింతించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుంచి పేర్లు గల్లంతైన, చిరునామా మారిన ఓటర్లకు ఎన్నికల సంఘం (ఈసీ) మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ప్రచురించిన సర్‌ ముసాయిదా జాబితాలో ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌ (ఏఎస్‌డీడీ) కారణాలతో పేర్లు తొలగింపునకు గురైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాలో చేరుస్తామని ఈసీ ప్రకటించింది. ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం భూపాలపల్లి నియోజకవర్గంలో 35,918మంది ఏఎస్‌డీడీ (గైర్హాజరు, చిరునామా మార్పు, మృతిచెందిన, డూప్లికేట్‌) కేటగిరీలో ఉండగా.. వారిలో అత్యధికంగా 22,703మంది శాశ్వత చిరునామా మారినవారే. వీరు తిరిగి ఓటరు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రక్రియను సులభతరం చేశారు. మరణించిన వారు 6,257, ఆన్‌కలెక్టబుల్‌/ ఆబ్సెంట్‌ 3,573, ఇతరులు 212, చిరునామా మార్పు కోసం 3,173 మంది ఉన్నారు. చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా ఫారం–8 సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారు ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చిరునామాకు సంబంధించిన ఆధారాన్ని సమర్పిస్తూ ఎన్యుమరేషన్‌ ఫారంలో వివరాలు నమోదు చేయవచ్చు. కొత్త చిరునామా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో చిరునామా మారినవారు తిరిగి ఓటర్ల జాబితాలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. ఇలాంటి వారు ఈ నెల 21లోగా సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఎవరిని సంప్రదించాలి..

ఓటుహక్కు కోల్పోయిన పౌరులు బూత్‌ లెవెల్‌ అధికారి, ఎన్నికల నమోదు అధికారి లేదా సహాయక ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించవచ్చు. వీరికి అవసరమైన పత్రాలను అందజేసి జాబితాలో పేరును పునరుద్ధరించుకోవచ్చు.

ఓటుహక్కు కోల్పోయిన వారికి

ఎన్నికల కమిషన్‌ సదావకాశం

చిరునామా మారిన వారికి

మార్గం సుగమం

ఫారం–8 అవసరం లేకుండానే ప్రక్రియ

ఈ నెల 21వరకు దరఖాస్తుల

సమర్పణకు గడువు

ఏఎస్‌డీడీ జాబితా ఓటర్లకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement