భూపాలపల్లి రూరల్: భీం ఘన్‌పూర్ చెరువు మండలంలోని పంబాపూర్, నాగారం, ఆజంనగర్ వరకు 5 కిలోమీటర్ల వరకు అధికారికంగా కాలువల ద్వారా 2,470 ఎకరాలకు ప్రతి ఏటా రెండు పంటలకు సాగు నీరు అందిస్తుంది. అనధికారికంగా మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం వరకు మరో 500 ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తుంది. నాగారం–ఆజంనగర్ మధ్య ఉన్న కాలువ పిచ్చిమొక్కలతో పెరిగి ఉంది. దీంతో ఇటీవల రైతులు పిచ్చిమొక్కలను వారే స్వయంగా తొలగించుకున్నారు. అధికారులు స్పందించి కాలువల్లో పిచ్చిమొక్కలను తొలగించి పూటిక తీపించి అందుబాటులోకి తీసుకురావాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.


