పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌ ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, పోలీసింగ్‌ పురోగతిపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని, గంజాయి రవాణా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ 1930 హెల్ప్‌లైన్‌పై అవగాహన పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు ‘పీఎం రాహత్‌’ (రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం), ‘రహవీర్‌’ (రూ.25 వేల ప్రోత్సాహకం) పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సీసీటీఎన్‌ఎస్‌ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement