● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లాలో పీఎం శ్రీ, సమగ్ర శిక్ష పథకాల కింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యాశాఖ, టీజీడబ్ల్యూఈఐడీసీ అధికారులతో పథకాల అమలు, నిధుల కేటాయింపు, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ కేటాయించిన బడ్జెట్‌ను నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికై న 8 పాఠశాలల్లో రికరింగ్, నాన్‌రికరింగ్ నిధుల ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యంపై టీజీడబ్ల్యూఈఐడీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ బిల్లుల సమర్పణ, ట్రెజరీ, ఐఎఫ్‌ఎంఎస్ లాగిన్‌లలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడా పోటీలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలని సూచించారు. పథకాల కింద చేపట్టిన పనుల పురోగతి, నిధుల వ్యయంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ లలిత, టీజీడబ్ల్యూఈఐడీసీ డీఈ జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభా పోటీలతోనే
నాయకత్వ లక్షణాలు
ఏటూరునాగారం: విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించడం ద్వారా నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక స్పృహ, సృజనాత్మకత పెంపొందుతాయని ఏటీడీఓ అజయ్ తెలిపారు. మండల పరిధిలోని ఆకులవారిఘణపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం పోటీలు నిర్వహించారు. లిటరేచర్, ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్, ఎకో, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లబ్‌లుగా విభజించి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష పెట్టారు. గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారికి విద్యా, సాంస్కృతిక, క్రీడా, సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీడీఏ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


