మొగుళ్లపల్లి: నిస్సహాయులకు సమర్థవంతంగా, సత్వరంగా ఉచితంగా న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థల ముఖ్య లక్ష్యమని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి, జడ్జి సీహెచ్ పంచాక్షరి అన్నారు. మంగళవారం జాతీయ న్యాయసేవల దినోత్సవం, సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పంచాక్షరి పాల్గొని మాట్లాడారు. అణగారిన వర్గాలకు తోడ్పాటును అందించడం న్యాయ సేవల చట్టం ప్రథమ కర్తవ్యం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు న్యాయసహాయాన్ని పొందడానికి అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరి మహతి వైష్ణవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, సురేష్, ఎంఈఓ కుమారస్వామి, ఉపాధ్యాయులు వెంకన్న, ఎంజేపీ స్కూల్ ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
అధికారులను అడ్డుకున్న రైతులు
కాళేశ్వరం: కాళేశ్వరం నుంచి కన్నెపల్లి వరకు ఎన్‌హెచ్–353(సీ) రహదారి విస్తరణ పనులకు మరోసారి ఆటంకం ఏర్పడింది. మహదేవపూర్ టు కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.163 కోట్లు మంజూరు చేసింది. రామగుండంలో స్వయాన పీఎం నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ పనుల కోసం కాళేశ్వరం సబ్‌స్టేషన్ శివారు నుంచి రైతుల పొలాల మీదుగా కన్నెపల్లి వరకు కాళేశ్వరం, కన్నెపల్లి గ్రామాలకు చెందిన సుమారు 45మంది రైతులకు చెందిన 11.20 ఎకరాల భూమిని గతంలో సర్వే చేసి, పరిహారం సొమ్మును కూడా డిపాజిట్ చేశారని తెలిసింది. మంగళవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది మరోసారి సర్వేకు రాగా రైతులు అడ్డుకున్నారు. గతంలో నిర్వహించిన సర్వే సక్రమంగా లేదని రీ సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో సర్వే అధికారులు వెనుదిరిగారు. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ రహదారి పనులు ప్రారంభమవుతాయని ఆశించిన తరుణంలో మళ్లీ సర్వే వివాదం తెరపైకి రావడంతో పనుల జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికి మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు సుమారు 14 కిలోమీటర్ల దూరం ఫారెస్టు క్లియరెన్స్ కూడా రావాల్సి ఉంది.
రాష్ట్రస్థాయికి ఎంపిక
మల్హర్(కాటారం): ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 70వ ఎస్‌జీఎఫ్‌ఐ హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలకు కాటారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గురుకులానికి చెందిన బి.అజయ్, ఎం.శ్రీధర్, పి.రమేశ్ అనే ముగ్గురు క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ ముగ్గురు క్రీడాకారులు పాల్గొననున్నారని వరంగల్ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ సెక్రటరీ వాసుదేవరావు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కళాశాల ప్రిన్సిపాల్ సోమాజి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, డిప్యూటీ వార్డెన్ నీలిమ, హ్యాండ్ బాల్ కోచ్ ఎం.వెంకటేష్, ిపీడీ కుడిమేత మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విశేష ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాకు, గురుకులానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


