శ్రమే నా ఆయుధం.. | - | Sakshi
Sakshi News home page

శ్రమే నా ఆయుధం..

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

శ్రమే నా ఆయుధం..

‘నా కల నిజం కావడానికి 11 ఏళ్లు పట్టింది. చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, ఏకాగ్రతతో పట్టుదలతో చదివితే ఎవరైనా విజయం సాధించవచ్చు. పట్టు వదలకుండా కన్సిస్టెన్సీ మెయింటెయిన్‌ చేయడమే ఏ రంగంలోనైనా విజయానికి అసలైన రహస్యం’ అని ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై న భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డ్యాగల సాయి పవన్‌ అంటున్నారు. సాయి పవన్‌ విజయ ప్రయాణం ఆయన మాటల్లోనే..

ఎన్నో వైఫల్యాలు.. చెరగని ఆత్మవిశ్వాసం

మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. చెల్లి బిట్స్‌ పిలానీ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్‌ పొందింది. నాకు మొదటి నుంచి లా డిగ్రీ చేయాలన్నది బలమైన కోరిక. నాన్న సూచన మేరకు ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని, హుజూరాబాద్‌లోని కిట్స్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (ట్రిపుల్‌ ఈ) పూర్తి చేశాను. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ప్రిపేరవుతూనే దాదాపు 16 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యా. ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌ వంటి ప్రతిష్టాత్మక డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలకూ వెళ్లా. అయితే అదృష్టం కొన్నిసార్లు చిన్న తేడాతో దూరమయ్యేది. రెండు సార్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పరీక్షలో కేవలం 3 సెకండ్లు, 0.14 మిల్లీసెకండ్ల వ్యవధితో ఈవెంట్స్‌ మిస్‌ అవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినా పట్టువదల్లేదు.

తలుపు తట్టిన విజయం

2018లో జీవితంలో నాకు తొలి విజయం తలుపు తట్టింది. దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ ప్రవేశ పరీక్షను క్లియర్‌ చేసి అడ్మిషన్‌ పొందాను. అక్కడే లా పూర్తి చేశాక ఢిల్లీలోని ప్రముఖ లా ఫోరమ్స్‌లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయినా వాటిని సున్నితంగా తిరస్కరించా. నా లక్ష్యం న్యాయమూర్తి (జడ్జి) కావాలనే కల వైపే నా అడుగులు పడ్డాయి.

సవాళ్లు, పాఠాలు

జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షకు సన్నద్ధమవడం మొదలుపెట్టాను. రెండు సార్లు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే రెండోసారి కూడా చివరి దశలో సెలెక్ట్‌ కాకపోవడంతో కుంగిపోకుండా ఆత్మపరిశీలన చేసుకున్నాను. కేవలం కష్టపడితే సరిపోదని, ‘స్మార్ట్‌ వర్క్‌’ కూడా చాలా అవసరమని గ్రహించాను. నాతో పాటు ఇంటర్వ్యూ వరకు వెళ్లి, నాకు ముందు బ్యాచ్‌లలో జడ్జిలుగా ఎంపికై న నా మిత్రుల సహాయం తీసుకున్నాను. ప్రతీ దశకు ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ప్రిపరేషన్‌ సాగించాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement