అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టు | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టు

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

● అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

కాళేశ్వరం: కాళేశ్వరం గ్రామ సమీప అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. శనివారం మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో పౌర సరఫరాల శాఖ, పోలీస్‌, పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభించేలా చూడటంతో పాటు, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణలోకి తరలించకుండా నిరోధించేందుకు ఈ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసు, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో 24 గంటల పాటు నిరంతర తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సరిహద్దు దాటి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సంక్షేమం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌, డీఎం రాములు, ఎస్సై సురేశ్‌, రెవెన్యూ సిబ్బంది జీపీఓ శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement