● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
రేగొండ: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ–సాక్ష్య, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ దర్యాప్తు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణతో పాటు రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ సంపత్‌రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


