పగటిపూట క్రీడాకారులు, వాకర్లతో సందడిగా ఉండే స్టేడియం.. రాత్రి వేళల్లో మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. చీకటి పడిన తర్వాత కొందరు మద్యం సేవించేందుకు స్టేడియం పరిసరాలను ఉపయోగిస్తున్నారు. ఉదయం వాకింగ్‌కు వచ్చే వారికి వాకింగ్ ట్రాక్ వెంట, చెట్ల కింద ఖాళీ మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఆకతాయిలు మద్యం, ఇతర మత్తు పదార్థాల ప్రభావంతో మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాయంత్రం వేళల్లో ఒంటరిగా స్టేడియానికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.


