వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Sep 29 2026 1:15 AM | Updated on Sep 29 2026 1:15 AM

జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. సాయంత్రం చల్లగాలులు వీస్తాయి.

క్రీడాకారులకు ప్రోత్సాహం

● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

● జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా ఉత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, విద్యార్థులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే వారితో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. జిల్లాలో క్రీడలకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రఘు, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి లావుడ్య జయపాల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పీఈటీలు క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డిజిటల్‌ క్రాప్‌ సర్వే

పూర్తి చేసుకోవాలి

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలోని రైతులందరూ సెప్టెంబర్‌ 30వ తేదీలోపు రిజిస్ట్రీ ఐడీ క్రియేషన్‌, డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకునేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సర్వేకు సంబంధించి రైతులు తమ పరిధిలోని మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, డిజిటల్‌ క్రాప్‌ సర్వే వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement